Posted by Sakshyam Magazine on Sunday, July 6, 2014
ఆయతులు:7 అవతరణ ;మక్కాలో
అనంతకరుణామయుడు,అపారకృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.
1-3 అల్లాహ్ మాత్రమే స్తుతింపదగినవాడు.ఆయన సకల లోకాలకు ప్రభువు.అనంతకరుణామయుడు,అపార కృపాశీలుడు, ప్రతిఫలదినానికి స్వామి.
4-7 మేము నిన్నే ఆరాధిస్తాము.సహాయం కొరకు నిన్నే అర్ధిస్తాము.మాకు ఋజుమార్గం చూపించు-నీవు అనుగ్రహించినవారూ,నీ ఆగ్రహానికి గురికానివారూ,మార్గభ్రష్టులు కానివారూ అనుసరించిన మార్గం.
Next page